Top story: ఆమెకు 46.. వాడికి 23.. ఇద్దరూ జంప్‌.. వీళ్ల ప్లాన్ తెలిస్తే.. ‌!

ఇదో వింత కథ.. నిజానికి ఇది కథ కాదు.. మానవ సంబంధాలు ఎక్కడికి పోతున్నాయనే ప్రశ్నలు మిగిల్చే వ్యథ ఇది ! ఆమెకు 46.. వాడికి 23... ఎవరు పడేశారో కానీ.. ఇద్దరు ప్రేమలో మునిగి పోయారు.

  • Written By:
  • Publish Date - January 28, 2026 / 11:26 AM IST

ఇదో వింత కథ.. నిజానికి ఇది కథ కాదు.. మానవ సంబంధాలు ఎక్కడికి పోతున్నాయనే ప్రశ్నలు మిగిల్చే వ్యథ ఇది ! ఆమెకు 46.. వాడికి 23… ఎవరు పడేశారో కానీ.. ఇద్దరు ప్రేమలో మునిగి పోయారు. కట్‌ చేస్తే ఓ రోజు ఇద్దరు ఎక్కడికో వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమె భర్త చేసిన పనే ఇప్పుడు ప్రతీ ఒక్కరిని షాక్‌కు గురి చేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో పాటు.. ఇద్దరు పిల్లలను వదిలిపెట్టి.. ఓ వివాహిత తనలో సగం వయసు కలిగిన యువకుడితో అదృశ్యమైన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

జూబ్లిహిల్స్‌కు చెందిన 46ఏళ్ల ఆర్తి.. భర్త పాశ్వాన్‌తో కలిసి నివనాసం ఉంటోంది. వీరిద్దరిది ఉత్తర భారతదేశంలో ఓ నగరం. చాలా సంవత్సరాల క్రితమే.. నగరానికి వచ్చి స్థిరపడ్డారు. 2004నుంచి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 47లోని ఓ వ్యాపారి ఇంట్లో వంట మనుషులుగా పనిచేస్తూ అక్కడే ఉంటున్నారు. వీరికి 19ఏళ్ల కొడుకు, 16ఏళ్ల కూతురు ఉన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన శ్రీధర్‌ అనే యువకుడితో.. ఆ వివాహిత ప్రేమలో పడింది. ఇద్దరూ రెగ్యులర్‌గా కలుసుకునే వారు కూడా ! ఆ తర్వాత ఆ యువకుడు.. పాశ్వాన్ పనిచేస్తున్న ఇంట్లోనే వాచ్‌మెన్‌గా చేరాడు.

ఐతే ఆ తర్వాత ఆర్తి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఇది పాశ్వాన్‌కు అనుమానం పెరిగిపోయేలా చేసింది. అసలు ఆర్తి తీరు ఏంటో తెలుసుకోవాలని.. ఆమె కదలికలపై దృష్టి పెట్టడం స్టార్ట్ చేశాడు. శ్రీధర్ మీద ఆర్తి మనసు పారేసుకున్నట్టు భర్త గుర్తించాడు. ఇదే విషయంపై నిలదీశాడు. దీంతో ఆమె పొంతన లేని సమాధానం చెప్పింది. దగీంతో ఆమెను ఈసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రవర్తన మార్చుకోకపోతే.. ఊరుకునేది లేదని అన్నాడు. దీంతో భర్త మీద ఆర్తి కోపం పెంచుకుంది. శ్రీధర్‌తో కలిసి వెళ్లిపోయింది.

జనవరి 19న ఊరికి అని చెప్పేసి.. శ్రీధర్‌ వెళ్లిపోయాడు. 23న బయటకు వెళ్లొస్తానని ఆర్తి కూడా ఇంటి నుంచి వెళ్లిపోయింది. మళ్లీ తిరిగి రాలేదు. ఆర్తి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడం.. ఆమెకు సంబంధించిన వస్తువులు కనిపించకపోవడంతో.. పాశ్వాన్‌కు అనుమానం వచ్చింది. దీంతో అతడు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. భార్య కనిపించడం లేదని ఫిర్యాదు చేశాడు. శ్రీధర్ అనే యువకుడి మీద అనుమానం ఉందని చెప్పాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ మధ్య ఉత్తరప్రదేశ్‌లోనూ ఓ వివాహిత ఇలానే.. తనకంటే వయసులో చిన్నవాడైన వ్యక్తితో కలిసి వెళ్లిపోయింది. చివరికి ఆమె భర్త పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారిద్దరిని కష్టపడి వెతికి తీసుకొచ్చారు. ఆ తర్వాత వారిద్దరికీ పోలీస్ స్టేషన్‌లోనే భర్త పెళ్లి చేశాడు.