పెళ్లికి కొన్ని గంటల ముందు బెడ్‌ మీద లవర్‌తో పలాశ్‌, పట్టుకుని చితక్కొట్టిన మహిళా క్రికెటర్లు

ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధనా పెళ్లి రద్దుకు సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పలాశ్ ముచ్చల్ మోసం చేయడంతోనే స్మృతి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందని కొద్దిరోజులుగా జరుగుతున్న

  • Written By:
  • Publish Date - January 24, 2026 / 06:55 PM IST

ఇండియన్‌ స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధనా పెళ్లి రద్దుకు సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పలాశ్ ముచ్చల్ మోసం చేయడంతోనే స్మృతి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందని కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చేలా.. ఆమె ఫ్రెండ్, యాక్టర్‌ విద్యాన్ మానే కీలక విషయాలను బయటపెట్టాడు. మహారాష్ట్రలోని సాంగ్లీ పోలీస్ స్టేషన్‌లో పలాశ్ ముచ్చల్‌పై ఫిర్యాదు కూడా చేశాడు.

విడుదల కాని ఓ సినిమాకు పెట్టుబడి పేరుతో పలాశ్ తనను 40 లక్షలు మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. “2025 నవంబర్ 23 జరిగిన పెళ్లి వేడుకలకు నేను వెళ్లా. ఆ సమయంలో వేరే యువతితో బెడ్‌పై ఉండగా పలాశ్‌ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అది చాలా భయంకరమైన సన్నివేశం. అది చూసిన మహిళా క్రికెటర్లు పలాశ్‌ను కొట్టారు. అతని ఫ్యామిలీ మొత్తం మోసగాళ్లే. పెళ్లి తర్వాత పలాశ్ అతను సాంగ్లీలో స్థిరపడతాడని అనుకున్నా. కానీ అంతా తలకిందులైంది.“అని రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యాన్ మానే చెప్పాడు. విద్యాన్ మానే స్మృతి మంధానకు చిన్ననాటి స్నేహితుడు. మంధాన కుటుంబం ద్వారానే అతనికి పలాశ్‌తో పరిచయం ఏర్పడింది. స్మృతి మంధాన – పలాశ్ ముచ్చల్ పెళ్లి గతేడాది నవంబర్ 23న వివాహం జరగాల్సి ఉంది. కానీ అదే రోజు స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆ రోజు జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది.

అప్పట్లో రెండు కుటుంబాల్లో అనారోగ్య సమస్యలే పెళ్లి వాయిదాకు కారణమని మీడియాకు చెప్పారు. కానీ పలాశ్ మోసం చేయడంతోనే స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఇరు కుటుంబాలు స్పందించలేదు. తరువాత స్మృతి మంధనా తన ఇన్‌స్టాలో పలాశ్‌ ఫొటోలు కూడా డెలీట్‌ చేసింది. స్మృతి మంధనాతో పాటు ఆమె ఫ్రెండ్స్‌ కూడా ఫొటోలు డెలీట్‌ చేసి పలాశ్‌ను అన్‌ఫాలో చేశారు. తరువాత కొన్ని రోజులకే పెళ్లి రద్దు చేసుకున్నట్టు స్మృతి మంధనా ప్రకటించింది. దీంతో ఖచ్చితంగా ఏదో జరిగిందని ప్రతీ ఒక్కరికీ క్లారిటీ వచ్చింది. కానీ ఏం జరిగింది అనేది మాత్రం తెలియదు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు స్మృతి ఫ్రెండ్ విద్యాన్ మానే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.