గెలిచే మ్యాచ్ లో ఓటమి రాజస్థాన్ దరిద్రం అదే…!

ఢిల్లీ క్యాపిటల్స్ - రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

  • Written By:
  • Publish Date - April 17, 2025 / 02:30 PM IST

ఢిల్లీ క్యాపిటల్స్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ ఆఖరి బంతికి 188 పరుగులు చేయడంతో మ్యాచ్ టై గా ముగిసింది.ఇరు జట్లు సేమ్ స్కోర్ చేయడంతో సూపర్ ఓవర్ థ్రిల్లింగ్ చూడాల్సి వచ్చింది. ఈ సూపర్ ఓవర్‌లో రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. హెట్మెయర్, రియాన్ పరాగ్ ఓపెనర్లుగా దిగారు. మిచెల్ స్టార్క్ అద్భుత బౌలింగ్‌తో కేవలం 11 పరుగులకే కట్టడి చేశాడు. రియాన్ పరాగ్, జైస్వాల్ ఇద్దరూ రనౌట్లు కావడంతో 5 బంతులకే రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసింది.

12 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం నాలుగు బంతుల్లోనే మ్యాచ్ ముగించింది.నిజానికి ఈ మ్యాచ్ లో ఢిల్లీ గెలిచిందనే దాని కంటే రాజస్థాన్ రాయల్స్ చేజేతులా ఓడిందని చెప్పొచ్చు. ఫీల్డింగ్ లో పలు క్యాచ్ జారవిడవడం, చివరి ఓవర్లో సందీప్ శర్మ అనవసరం వైడ్లు, నోబాల్ వేయడం.. అన్నింటికంటే మించి సూపర్ ఓవర్లో ఆలౌటవడం రాజస్థాన్ ఓటమికి కారణమయ్యాయి. ఓపెనర్లు సంజూ శాంసన్, జైశ్వాల్ మంచి ఆరంభాన్నిచ్చారు. పవర్ ప్లేలో ఆర్ఆర్ వికెట్ కోల్పోకుండా 63 పరుగులు చేసింది. సంజూ పక్కటెముకలు పట్టేయడంతో రిటైర్డ్ ఔట్ గా వెనుదిరగడం రాజస్థాన్ ను దెబ్బతీసింది. కానీ జైశ్వాల్ , నితీశ్ రాణా హాఫ్ సెంచరీలు చేయగా.. ధృవ్ జురెల్ కూడా ధాటిగా ఆడడంతో గెలిచేలా కనిపించింది.

చివరి ఓవర్లో విజయం కోసం 9 పరుగులు చేయాల్సి ఉండగా.. ఢిల్లీ పేసర్ మిఛెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎక్కువ భాగం యార్క‌ర్లు, టైట్ బౌలింగ్ తో 8 ప‌రుగులే ఇచ్చాడు. తొలి రెండు ఓవర్లలో ధారళంగా పరుగిలిచ్చిన స్టార్క్.. చివర్ స్పెల్‌లో మాత్రం నిప్పులు చెరిగాడు. ముఖ్యంగా 18వ ఓవర్‌లో క్రీజులో సెట్ అయిన నితీష్ రాణాను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. కచ్చితమైన యార్కర్లతో మ్యాచ్‌ను టైగా మార్చాడు. దీంతో నాలుగేళ్ల త‌ర్వాత ఐపీఎల్లో ఒక మ్యాచ్ టై అయ్యి, సూప‌ర్ ఓవ‌ర్ కు దారి తీసింది. ఈ సూప‌ర్ ఓవ‌ర్లో రాజస్థాన్ బ్యాటర్లు తడబడడం, ఢిల్లీ ఈజీ విక్టరీ అందుకుంది.