ఒక్క ఇన్నింగ్స్ చాలు.. సంజూకి టీమిండియా కోచ్ ఫుల్ సపోర్ట్

వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న సంజూ శాంసన్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి పెద్ద అండ దొరికింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20

  • Written By:
  • Publish Date - January 28, 2026 / 07:00 PM IST

వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న సంజూ శాంసన్‌కు టీమిండియా మేనేజ్‌మెంట్ నుంచి పెద్ద అండ దొరికింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా, సంజూ ఫామ్ త్వరలోనే తిరిగి వస్తుందని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పష్టంగా చెప్పాడు. వరల్డ్‌కప్‌కు ముందు ఇలాంటి దశలు సహజమని, సంజూ ఒక్క మంచి ఇన్నింగ్స్ దూరంలోనే ఉన్నాడని మోర్కెల్ అభిప్రాయపడ్డాడు.ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో సంజూ కేవలం 16 పరుగులే చేయగలిగాడు. గువాహటి మ్యాచ్‌లో గోల్డెన్ డక్ కూడా రావడంతో విమర్శలు పెరిగాయి. అయితే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లాంటి బ్యాటర్లు దూకుడుగా ఆడుతున్న వేళ, సంజూ మాత్రం ఆరంభంలోనే వికెట్ కోల్పోతుండటం చర్చకు దారితీసింది.

అయితే టీమిండియా మేనేజ్‌మెంట్ సంజూ శాంసన్‌కు అండగా నిలిచింది. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నా, త్వరలోనే ఫామ్ అందుకుంటాడని బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ధీమా వ్యక్తం చేశాడు. నెట్స్‌లో బాగానే ఆడుతున్నాడని, ఒక్క మంచి ఇన్నింగ్స్ దూరంలోనే ఉన్నాడని, వరల్డ్‌కప్‌కు ముందు సరైన సమయంలో పీక్ ఫామ్ అందుకోవడమే లక్ష్యమని తెలిపాడు.నాలుగో టీ20 మ్యాచ్‌కు ముందు మాట్లాడిన మోర్నీ మోర్కెల్ సంజూ ఫామ్ తిరిగి రావడానికి ఒక్క ఇన్నింగ్స్ సరిపోతుందన్నాడు.

ఇదిలా ఉంటే ఆప్షనల్ నెట్స్ సెషన్ అయినప్పటికీ సంజూ దాదాపు అరగంటకుపైగా సాధన చేశాడు. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మతో పాటు సైడ్ ఆర్మ్ బౌలర్ రఘు బంతులను ఎదుర్కొన్నాడు. మొదట కొంత ఇబ్బంది పడినప్పటికీ, క్రమంగా తన సహజ ఆటకు వచ్చి స్టేడియం నలుమూలలా షాట్లు ఆడాడు. నెట్స్ అనంతరం సంజూ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్‌తో కూడా దీర్ఘంగా చర్చించాడు. ఈ సమయంలో శ్రేయస్ అయ్యర్ తన సాధన కొనసాగించాడు. సంజూ బ్యాటింగ్‌లో చేయాల్సిన మార్పులపై కోచ్‌లు ఓపికగా వివరించినట్లు సమాచారం. సంజూ ఫామ్‌పై తాను పెద్దగా ఆందోళన చెందట్లేదని మోర్కెల్ మరోసారి స్పష్టం చేశాడు. వ్యక్తిగత ప్రదర్శనల కంటే టీమ్ గెలుపే ముఖ్యమనీ,. ప్రస్తుతం జట్టు చాలా మంచి క్రికెట్ ఆడుతోందన్నాడు. వరల్డ్‌కప్‌కు ముందు ఇంకా కొన్ని మ్యాచ్‌లు ఉన్నాయనీ , సంజూ తన ఫామ్ తిరిగి పొందుతాడన్న నమ్మకం ఉందన్నాడు.