ఐసీసీ వార్నింగ్ తో షాక్ తిన్న పాక్, అన్నీ మూసుకుని జట్టు ప్రకటన

టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనడంపై గత కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగిస్తున్న పాకిస్థాన్ ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది.

  • Written By:
  • Publish Date - January 26, 2026 / 03:10 PM IST

టీ20 వరల్డ్ కప్ 2026లో పాల్గొనడంపై గత కొన్ని రోజులుగా సస్పెన్స్ కొనసాగిస్తున్న పాకిస్థాన్ ఎట్టకేలకు స్పష్టతనిచ్చింది. బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తొలగించినందుకు నిరసనగా తాము కూడా తప్పుకుంటామని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మొదట ప్రకటించారు. అయితే ఐసీసీ దీనిపై అత్యంత కఠినంగా స్పందించింది. ఒకవేళ పాక్ తప్పుకుంటే..పాకిస్థాన్‌తో అన్ని ద్వైపాక్షిక సిరీస్‌లను రద్దు చేస్తామని,ఆసియా కప్ నుంచి పాక్‌ను శాశ్వతంగా తొలగిస్తామని, పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడేందుకు విదేశీ ఆటగాళ్లకు ఎన్వోసీలు నిరాకరిస్తామని హెచ్చరించింది.

ఈ ఆర్థిక, క్రీడాపరమైన ఆంక్షలు పాక్ క్రికెట్ ఉనికినే ప్రమాదంలో పడేస్తాయని గ్రహించిన పీసీబీ.. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే జట్టును ప్రకటించింది. పాక్ పాల్గొనడంపై సస్పెన్స్ వీడటంతో, క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయింది. ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ తన గ్రూప్ దశ మ్యాచ్‌లన్నీ శ్రీలంకలోనే ఆడనుంది. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో పాక్ తన ప్రపంచకప్ జర్నీని మొదలుపెట్టనుంది.