టాలీవుడ్ లో విషాదం.. ఆనంద్ దేవరకొండ సినిమా నిర్మాత హఠాన్మరణం..!

తెలుగు ఇండస్ట్రీలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. యువ నిర్మాత హఠాన్మరణం పాలయ్యాడు. ఆయన మరణ వార్త తెలిసి ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది.

  • Written By:
  • Publish Date - February 26, 2025 / 11:28 AM IST

తెలుగు ఇండస్ట్రీలో అనుకోని విషాదం చోటు చేసుకుంది. యువ నిర్మాత హఠాన్మరణం పాలయ్యాడు. ఆయన మరణ వార్త తెలిసి ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కించిన సినిమా గంగం గణేశా. 2024 లో విడుదలైన ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు. ఈ సినిమాను కేదార్ శలగం శెట్టి, వంశీ కారుమంచి సంయుక్తంగా నిర్మించారు. తాజాగా ఇందులో కేదార్ కన్నుమూశారు.

చిన్న వయసులోనే ఈయన హఠాన్మరణం కుటుంబ సభ్యులనే కాదు ఇండస్ట్రీని కూడా షాక్ కు గురి చేసింది. కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధ పడుతున్నాడు కేదార్. ఆరోగ్యం విషమించడంతో కాసేపటి కింద కేదార్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కొన్ని రోజులుగా ఆయన దుబాయ్ లోని నివాసం ఉంటున్నారు. కేదార్ కు ఒక కూతురు ఉంది. ఈయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు సినీ రాజకీయ ప్రముఖులు.