హైడ్రా రంగనాథ్: ఆయేషా మీరా టూ హైడ్రా, వయా మారుతీ రావు
హైడ్రా రంగనాథ్… ఇప్పుడు ఈ పేరు వింటే హైదరాబాద్ లో భవనాల యజమానులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. రాజకీయ నాయకులు అయినా… సినిమా నటులు అయినా… సాధారణ ప్రజలు అయినా ఎవరిని వదలను అంటూ రంగనాథ్ ప్రదర్శిస్తున్న దూకుడు ఇప్పుడు సంచలనం అవుతోంది.