ఎన్నికల వేళ వరుస ఐటీ దాడులు రాజకీయ నేతలను ఇబ్బందులు పెడుతున్నాయి. ఇప్పటికే పలు కాంగ్రెస్ నేతలపై ఐటీ, ఈడీ దాడులు జరగగా.. ఇప్పుడు బీఆర్‌ఎస్ నేతలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. తాండూరు ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ అభ్యర్థి.. పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు నిర్వహించింది. తాండూరు, హైదరాబాద్‌లో ఉన్న రోహిత్ ఇళ్లపై దాడులు చేశారు ఐటీ అధికారులు. రోహిత్ నుంచి 20 లక్షలు, రోహిత్ తమ్ముడు రితీష్ నుంచి 24 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

IT attack on BRS MLA during Telangana elections 20 lakhs seized from BRS MLA..