PAYTM: భారీగా పతనమైన పేటీఎం షేర్లు.. రెండు రోజుల్లోనే 40 శాతం పతనం..
బుధవారం పేటీఎం షేరు ధర 761 రూపాయలు. ఇప్పుడు దాని ధర రూ. 487 రూపాయలు. ఈ ఒక్క లెక్క చెబుతోంది పేటీఎం షేర్లు ఏ రేంజ్‌లో పడిపోయాయో చెప్పడానికి. కేవలం రెండంటే రెండు రోజుల్లో ఏకంగా 40శాతం పతనమయ్యాయంటే ఏ స్థాయిలో అమ్మకాల ఒత్తిడి ఉందో అర్థమవుతుంది.