రోహిత్,కోహ్లీ రెస్ట్ తీసుకోండి, ట్రెండింగ్ లో హ్యాపీ రిటైర్మెంట్

భారత స్టార్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు త‌మ పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నారు. మెల్‌బోర్న్ టెస్టులోనూ వీరిద్ద‌రూ ఫెయిలయ్యారు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

  • Written By:
  • Publish Date - December 30, 2024 / 02:18 PM IST

భారత స్టార్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీలు త‌మ పేల‌వ ఫామ్‌ను కొన‌సాగిస్తున్నారు. మెల్‌బోర్న్ టెస్టులోనూ వీరిద్ద‌రూ ఫెయిలయ్యారు. ఈ క్ర‌మంలో వీరిద్ద‌రిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఈ ఇద్ద‌రూ ఇన్నాళ్లు టీమ్ఇండియాకు అందించిన సేవ‌లు ఇక చాలు అని, వీరిద్ద‌రు రిటైర్‌మెంట్ తీసుకోవాల్సిన స‌మ‌యం ఆసన్న‌మైంద‌ని అంటున్నారు. వీరి గణాంకాలను పోస్ట్ చేస్తూ రంజీల్లో ఆడి సత్తా నిరూపించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. అంతేకాదు వీరిద్దరికీ సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హ్యాపీ రిటైర్మెంట్ HappyRetirement అనే హ్యాష్ ట్యాగ్‌ని ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. ఈ సిరీస్ లో రోహిత్ కంటే కాస్త బెటర్ అనిపించినా ఓవరాల్ గా కోహ్లీ కూడా ఫ్లాప్ షో కనబరిచాడు. సిరీస్ మొత్తంలో ఇప్పటి వరకూ ఒకే ఒక శతకం చేశాడు.