నితీశ్ ఒక అద్భుతం, రోహిత్ శర్మ ప్రశంసలు

ఆస్ట్రేలియా టూర్ లో ఈ సారి నిలకడగా రాణించిన భారత ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అతను తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి మాత్రమే... బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ చేయడం ద్వారా జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు.

  • Written By:
  • Publish Date - December 30, 2024 / 05:41 PM IST

ఆస్ట్రేలియా టూర్ లో ఈ సారి నిలకడగా రాణించిన భారత ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అతను తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి మాత్రమే… బాక్సింగ్ డే టెస్టులో సెంచరీ చేయడం ద్వారా జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. తాజాగా నితీశ్ కుమార్ రెడ్డిపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసలు కురిపించాడు. అతడు తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు మ్యాచ్‌లు ఆడుతున్నా అద్భుత పోరాటపటిమ కనబరిచాడనీ కితాబిచ్చాడు. అతడి టెక్నిక్స్‌ కూడా బాగున్నాయన్నాడు. విజయవంతమైన ఆల్‌రౌండర్‌గా ఎదిగే అన్ని లక్షణాలు అతడిలో ఉన్నాయన్న రోహిత్ రోజురోజుకూ అతడు మరింత మెరుగుపడాలని కోరుకుంటున్నానని చెప్పాడు. మేనేజ్‌మెంట్‌, జట్టు నుంచి అతడికి పూర్తి సహకారం ఉందన్నాడు. నితీశ్‌ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందంటూ రోహిత్ ఆకాంక్షించాడు.