నితీశ్ తీసేయాలన్న మంజ్రేకర్, మండిపడుతున్న భారత్ ఫ్యాన్స్
ఆస్ట్రేలియా టూర్ లో తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి ఆకట్టుకుంటున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఫ్యూచర్ ఆల్ రౌండర్ గా ప్రశంసలు అందుకుంటున్నాడు. తొలి రెండు టెస్టుల్లో నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్‌తో దుమ్మురేపాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 41, 38 నాటౌట్, 42, 42 పరుగులతో రాణించాడు.