క్లే కోర్టులో తిరుగులేని మొనగాడు. ఎర్రమట్టి కోర్టు…అతడికి కంచుకోట. ఒకటా రెండా…ఏకంగా 14 టైటిళ్లు. దిగ్గజాలతో తలపడ్డాడు. అందరిపైనా పైచేయి సాధించాడు. రోజర్ ఫెదరర్, నోవాక్ జకోవిచ్ లకే చుక్కలు చూపించాడు. ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, యుఎస్ ఓపెన్…టోర్నీ ఏదయినా సత్తా చాటాడు. ఎవరికి అందనంత ఎత్తుకు ఎదిగాడు.
