కేటిఆర్ ఉయ్యాల లాంటోడు: రేవంత్ సెటైర్లు

తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి...

  • Written By:
  • Publish Date - November 20, 2024 / 05:48 PM IST

తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి మరోసారి కేసీఆర్ కుటుంబంపై తీవ్ర వ్యాఖ్యలు చేసారు. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి… ప్రతిపక్ష నేతగా ఫాం హౌస్ లో పడుకోవడం కాదు, ఒక్కసారి అసెంబ్లీకి రా స్వామి అని సవాల్ చేసారు. త్వరలోనే కేటీఆర్ ఊసలు లెక్కపెట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు.

కేటీఆర్ ఎంత ఊరుకులాడిన ఇబ్బంది ఏం లేదన్న సిఎం… ఉయ్యాల ఎంత ఊగీన ఒక దగ్గర ఆగాల్సిందేనని ఎద్దేవా చేసారు. కేటిఆర్ ఉయ్యాల లాంటి వాడు అంటూ ఆయన ఎద్దేవా చేసారు. ఎవరో ఊపితేనే ఊగుతాడు అంటూ వ్యాఖ్యలు చేసారు. మంగళవారం కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు.