సద్దుమణిగినట్లు కనిపించిన వైసీపీ నేత దువ్వాడ ఫ్యామిలీ కథా చిత్రమ్‌లో కొత్త వివాదం తెరమీదకు వచ్చింది. దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో మాధురి ఉండటంపై ఆయన భార్య వాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని శ్రీనివాస్ నివాసం బాల్కనీలో దివ్వెల మాధురి అటు, ఇటూ తిరుగుతూ కనిపించారు.
