మంత్రి గుడివాడ అమర్నాథ్.. వచ్చే ఎన్నికల్లో పోటీకి నియోజకవర్గం లేకుండా పోయిందనే విమర్శలకు వైసీపీ చెక్ పెట్టనుంది. ఊహించినట్టే మంత్రికి కీలక స్ధానాన్ని అధిష్టానం రిజర్వ్ చేసింది. వైసీపీ సిట్టింగ్ సీట్ అయిన పెందుర్తిని గుడివాడ అమర్నాథ్‌కు కేటాయించాలని నిర్ణయించింది.
