ఏపీ రాజకీయాల్లో వివేకా హత్య కేసు రేపుతున్న ప్రకంపనలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. అవినాశ్ రెడ్డి అరెస్ట్ ఖాయం అని ప్రచారం మొదలైపోయింది కూడా ! కడప సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాశ్ రెడ్డి అరెస్ట్ జరిగితే.. వైఎస్ కుటుంబానికి అది భారీ దెబ్బగా మారుతోంది. నిజానికి కడప జిల్లా అనేది వైఎస్ కుటుంబానికి కంచుకోట. జగన్ పార్టీకి అధినేత అయినా.. సీఎం అయినా.. కడప జిల్లా వైసీపీ బాధ్యత అంతా వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిదే ! అలాంటి ఇద్దరు అరెస్ట్ అయితే ఆ కుటుంబానికి దెబ్బ తప్పదు.

Sunitha As MP Contistent in Pulivendual