మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు, ఆమెరికా క్రికెటర్ పై ఐసీసీ వేటు…!

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు అమెరికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది.

  • Written By:
  • Publish Date - January 29, 2026 / 06:05 PM IST

టీ20 ప్రపంచకప్‌-2026కు ముందు అమెరికా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఆరోన్ జోన్స్‌పై ఐసీసీ సస్పెన్షన్ వేటు వేసింది. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. బార్బడోస్ వేదికగా జరిగిన బిమ్ టీ10 టోర్నమెంట్‌-2024 సీజన్‌లో జోన్స్ మ్యాచ్ ఫలితాలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించాడని ఐసీసీ విచారణలో ప్రాథమికంగా తేలింది.

ఈ క్రమంలోనే అతడు అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లలో ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది. తనపై వస్తున్న ఆరోపణలపై 14 రోజుల సమాధానమివ్వాలని ఐసీసీ ఆదేశించింది. ఆరోన్ జోన్స్‌పై మొత్తం ఐదు అభియోగాలు నమోదయ్యాయి. జోన్స్ ఇప్ప‌టివ‌ర‌కు అమెరికా త‌ర‌పున 52 వన్డేలు, 48 టీ20లు ఆడాడు.