ప్రతీసారీ ఒకే గ్రూప్ లో భారత్, పాక్ అసలు సీక్రెట్ చెప్పిన గవాస్కర్…!

ఐసీసీ టీ - 20 వరల్డ్‌ కప్‌ 2026లో భారత్, పాకిస్తాన్‌లను సులభమైన గ్రూప్‌లో ఉంచడంపై సునీల్ గవాస్కర్ స్పందించారు. సంప్రదాయ ప్రత్యర్థుల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కోసమే ఐసీసీ ఈ ఏర్పాటు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Written By:
  • Updated On - January 28, 2026 / 08:16 PM IST

ఐసీసీ టీ – 20 వరల్డ్‌ కప్‌ 2026లో భారత్, పాకిస్తాన్‌లను సులభమైన గ్రూప్‌లో ఉంచడంపై సునీల్ గవాస్కర్ స్పందించారు. సంప్రదాయ ప్రత్యర్థుల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కోసమే ఐసీసీ ఈ ఏర్పాటు చేసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
రెండు జట్లను ఒకే గ్రూప్‌లో పెట్టడమే కాకుండా, అవి సులభంగా రెండో రౌండ్‌కు చేరేలా ఈజీ గ్రూప్ ఇచ్చారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవలి వరల్డ్‌కప్‌లన్నింటిలోనూ ఒకే విషయం కనిపిస్తోందనీ,. భారత్, పాకిస్తాన్‌లను ఒకే గ్రూప్‌లో పెడతారన్నారు. పైగా ఆ గ్రూప్ చాలా సులభంగా ఉంటుందనీ,. తద్వారా రెండూ తర్వాతి రౌండ్‌కు చేరే అవకాశాలు పెరుగుతాయని వ్యాఖ్యానించారు.

ఈసారి యూఎస్ఏ గతంతో పోలిస్తే మరింత బలమైన జట్టుగా మారిందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. మేజర్ లీగ్ క్రికెట్‌లో ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ఆడటం వల్ల యూఎస్ఏ ఆటగాళ్లలోని భయం తగ్గిందని ఆయన అన్నారు. పెద్ద ప్లేయర్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేయడం యువ ఆటగాళ్ల ఆటను ముందుకు నడిపిస్తుందని గవాస్కర్ పేర్కొన్నారు.టీ20 వరల్డ్‌కప్ 2026లో భారత్, పాకిస్తాన్‌లు గ్రూప్–ఏలో చోటు దక్కించుకున్నాయి.

ఈ గ్రూప్‌లో నమీబియా, నెదర్లాండ్స్, యూఎస్ఏ కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరిగే భారత్–పాక్ మ్యాచ్ టోర్నీకి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది.ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్‌పై భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ల్లో పాకిస్తాన్ భారత్‌ను ఒక్కసారి మాత్రమే ఓడించింది. అది కూడా 2021లో దుబాయ్‌లో జరిగిన మ్యాచ్‌లో. గత ఏడాది ఆసియా కప్‌లో అయితే భారత్ మూడు సార్లు పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్‌లో ట్రోఫీని కూడా సొంతం చేసుకుంది.
2024 టీ20 వరల్డ్‌కప్‌లో భారత్ ట్రోఫీని గెలిచి 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు ముగింపు పలికింది. ఆ టోర్నీలో పాకిస్తాన్ మాత్రం గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. భారత్‌తో పాటు యూఎస్ఏ చేతిలోనూ ఓడిపోవడం పాక్‌కు పెద్ద షాక్‌గా మారింది.