సౌతాఫ్రికా టీ ట్వంటీ లీగ్ ,కావ్యా పాప జట్టుదే టైటిల్….!

సౌతాఫ్రికా టీ ట్వంటీ లీగ్ 2026 విజేతగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజేతగా నిలిచింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

  • Written By:
  • Publish Date - January 26, 2026 / 05:50 PM IST

సౌతాఫ్రికా టీ ట్వంటీ లీగ్ 2026 విజేతగా సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజేతగా నిలిచింది. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఈ టోర్నీలో మూడో టైటిల్‌ను కైవసం చేసుకుంది. అంతకుముందు 2023, 2024లోనూ ఆ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది.ముందుగా బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 158 పరుగులు చేసింది. డెవాల్డ్ బ్రెవిస్ 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో 101  సెంచరీతో రాణించగా.. బ్రైస్ పార్సన్స్ 30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 30 రన్స్ తో పర్వాలేదనిపించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో మార్కో జాన్సన్ మూడు వికెట్లు తీయగా.. లుతో సిపమ్లా, అన్రిచ్ నోర్జ్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ 48 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. మరోసారి సన్‌రైజర్స్‌కు నిరాశ తప్పదా? అని ఫ్యాన్స్ భావించారు.ఈ పరిస్థితుల్లో మాథ్యూ బ్రిట్జ్‌కే, కెప్టెన్ ట్రిస్టన్ స్టబ్స్ సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ను ఆదుకున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో విజయానికి బాటలు వేసారు. బ్రిట్జ్‌కీ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా.. ట్రిస్టన్ స్టబ్స్ 37 బంతుల్లో అర్థ శతకాన్ని అందుకున్నాడు. దీంతో 19.2 ఓవర్లలో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్‌ 4 వికెట్లకు 162 పరుగులు చేసి గెలుపొందింది . మాథ్యూ బ్రెట్జ్‌కీ 49 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 68 నాటౌట్ , ట్రిస్టన్ స్టబ్స్ 41 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 63 నాటౌట్ అజేయ హాఫ్ సెంచరీలతో సన్‌రైజర్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు.ఈ ఇద్దరి అద్భుత ప్రదర్శనతో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ విజేతగా నిలిచింది. ఈ విజయంతో సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఓనర్ కావ్య మారన్ ఎగిరి గంతేసింది. ఈ ఫైనల్‌కు హాజరైన ఆమె.. దగ్గరుండి జట్టును గెలిపించింది.