వరల్డ్ కప్ ఆడాలనుకున్న బంగ్లా క్రికెటర్లు, ప్రభుత్వ నిర్ణయంతో తీవ్ర నిరాశ…!

బంగ్లాదేశ్ క్రికెటర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బంగ్లా తాతాల్కి క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌తో సమావేశం అనంతరం జట్టు హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు వారి ముఖాల్లో నిస్సహాయత

  • Written By:
  • Publish Date - January 26, 2026 / 01:07 PM IST

బంగ్లాదేశ్ క్రికెటర్ల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. బంగ్లా తాతాల్కి క్రీడల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌తో సమావేశం అనంతరం జట్టు హోటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు వారి ముఖాల్లో నిస్సహాయత, నిరాశ స్పష్టంగా కనిపించాయి. తమ భవిష్యత్తును ప్రభుత్వం, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఇప్పటికే నిర్ణయించేశాయని వారికి అర్థమైపోయినట్లుగా తెలుస్తుంది. తాత్కాలిక ప్రభుత్వం, బీసీబీ కారణంగానే బంగ్లాదేశ్ టీ20 వరల్డ్ కప్‌ నుంచి తప్పుకుంది. ఆ జట్టు స్థానంలో ఐసీసీ స్కాట్లాండ్ కు అవకాశమిచ్చింది. అయితే ప్రపంచకప్ ఆడడంపై బంగ్లాదేశ్ క్రికెటర్లు భారీ ఆశలే పెట్టుకున్నారు. అయితే, ఆసిఫ్ నజ్రుల్‌తో జరిగిన సమావేశంలో తమ అభిప్రాయాలకు గౌరవం ఇస్తారని బంగ్లాదేశ్ క్రికెటర్లు ఆశించారు. కానీ, ఈ భేటీ పూర్తిగా భిన్నంగా కొనసాగిందని సమాచారం.

ఆటగాళ్ల సమ్మతి తీసుకోవడం కోసం కాకుండా, ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని వారికి తెలియజేయడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లను భద్రతా కారణాలు చూపుతూ శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరింది. అయితే, సమావేశంలో ఆటగాళ్లకు కొద్దిసేపు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ, వారి అభిప్రాయాలకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదని తెలుస్తుంది. ఓ సీనియర్ క్రికెటర్ ఆవేదనతో మనం ఈ వరల్డ్ కప్ ఆడకపోతే నష్టమంతా మన క్రికెట్‌కే.. ఇది తమ భవిష్యత్తుకు పెద్ద దెబ్బ అని వ్యాఖ్యానించినట్లు సమాచారం.

తాత్కాలిక ప్రభుత్వం ముందే నిర్ణయం తీసుకుందనీ,. తమ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకునే పరిస్థితి అక్కడ లేనే లేదని మరొక ఆటగాడు ఆరోపించాడు. ఈ సమావేశం తమ సమ్మతి కోసం కాదని, ఇప్పటికే తీసుకున్న నిర్ణయాన్ని మాకు తెలియజేయడానికే పిలిచారని స్పష్టం మరికొందరు వ్యాఖ్యానించారు. తమతో చర్చించకుండా ముందే ప్లాన్ సిద్ధం చేసుకుని వచ్చారనీ,. ఇది పూర్తిగా ప్రభుత్వ ఆదేశమేననీ,. ఇందులో బీసీబీ చేయగలిగింది ఏమీ లేదని వెల్లడించారు. దీంతో మెగాటోర్నీ ఆడి సత్తా చాటాలనుకున్న బంగ్లా క్రికెటర్లు తమ ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయానికి మౌనంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం బంగ్లాదేశ్ క్రికెట్‌కు దీర్ఘకాలంలో భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉందని క్రీడా వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.