ఎందుకు ఆడించట్లేదో చెప్పాల్సిందే, రోహిత్ సంచలన వ్యాఖ్యలు…!

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ జట్టు ఎంపిక విషయంపై కీలక కామెంట్స్ చేశాడు. జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టమైన విషయమని అన్నాడు.

  • Written By:
  • Publish Date - January 23, 2026 / 09:41 AM IST

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ జట్టు ఎంపిక విషయంపై కీలక కామెంట్స్ చేశాడు. జట్టు ఎంపికలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం చాలా కష్టమైన విషయమని అన్నాడు. అయితే ఒక ఆటగాడిని మ్యాచ్​లో ఆడించకుండా, ఎందుకు పక్కన పెట్టామో అతడికి వివరించాల్సిన అవసరం ఉందని రోహిత్ అభిప్రాయపడ్డాడు. వచ్చే నెలలో భారత్- శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 వరల్డ్​కప్​నకు రోహిత్ బ్రాండ్ అంబాసిడర్​గా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో పలు విషయాలు షేర్ చేసుకున్నాడు.

జట్టును ఎంపిక చేసే ప్రక్రియ అత్యంత క్లిష్టమైనదనీ, ఈ క్రమంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ముఖ్యంగా కెప్టెన్​కు ఇది అత్యంత అత్యంత క్లిష్టమైన అంశంగా చెప్పుకొచ్చాడు. జట్టు ఎంపికలో అందరినీ సంతృప్తి పర్చలేమన్న రోహిత్ అయితే ఎందుకు పక్కన పెట్టామో మాత్రం ఆటగాడికి వివరంగా చెప్పడం అనేది ముఖ్యమన్నాడు. 2022 ఆసియా కప్, టీ20వరల్డ్​కప్​ టోర్నీల్లో శ్రేయస్‌ అయ్యర్‌ను కాదని బౌలింగ్‌ చేయగలిగే దీపక్‌ హుడాను తీసుకున్నామని గుర్తు చేసుకున్నాడు. టీమ్ బ్యాలెన్స్​గా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాను, హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్వయంగా అయ్యర్​కు వివరించామని చెప్పుకొచ్చాడు.

ఇక 2023 వన్డే వరల్డ్​కప్​ టోర్నమెంట్​లో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, 2025 ఛాంపియన్స్‌ ట్రోఫీ సమయంలో పేసర్ మహ్మద్‌ సిరాజ్‌కు కూడా ఇదే మాదిరిగా వివరించి చెప్పామన్నాడు. రానున్న టీ20 ప్రపంచ కప్​లో టీమ్ఇండియా సత్తా చాటుతుందనే నమ్మకం ఉందనీ,. టీమ్​లో 80 నుంచి 90 శాతం మంది ఆటగాళ్లు గత రెండేళ్లుగా కలిసే ఆడుతున్నారన్నాడు. టీమ్ యావరేజ్ వయసు 25 ఏళ్లు ఉండటం కూడా కలిసొచ్చే అంశమని రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే రోహిత్ తన కెరీర్​లో తొలిసారి టీ20 ప్రపంచకప్‌లో ఆడడం లేదు. 2007లో ప్రారంభమైన ఈ పొట్టి కప్ టోర్నీ ప్రతీ ఎడిషన్​లో రోహిత్ ఆడాడు. అయితే టీ20 ఫార్మాట్​కు రిటైర్మెంట్ ప్రకటించడంతో హిట్​మ్యాన్ ఈసారి పొట్టికప్​కు దూరమైయ్యాడు. దీంతో తొలిసారిగా ఈ టోర్నమెంట్​ను ఇంటి నుంచి చూడబోతుండడం తనకు వింత అనుభవమని రోహిత్ వ్యాఖ్యానించాడు.