Anand Mahindra: మాట నిలబెట్టుకున్న ఆనంద్ మహీంద్రా.. యువ క్రికెటర్ తండ్రికి గిఫ్ట్

అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సర్ఫరాజ్‌.. మెరుపు అర్ధ శతకం సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు. సర్ఫరాజ్‌ ఖాన్‌కు తన తండ్రి నౌషద్‌ ఖాన్‌ కోచ్‌, మెంటార్‌ గా ఉన్నాడు.

Post Published By: narender Thiru
Updated : 23 March 2024, 4:49 PM IST

Anand Mahindra: టీమిండియా తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన బ్యాటర్లలో సర్ఫరాజ్‌ ఖాన్‌ ఒకడిగా పేరొందాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సర్ఫరాజ్‌.. మెరుపు అర్ధ శతకం సాధించాడు. తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు.

RCB VS CSK: బెంగుళూరు ఓటమికి కారణాలివే..

సర్ఫరాజ్‌ ఖాన్‌కు తన తండ్రి నౌషద్‌ ఖాన్‌ కోచ్‌, మెంటార్‌ గా ఉన్నాడు. అరంగేట్రం సందర్భంగా టీమిండియా క్యాప్‌ను ముద్దాడి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు నౌషద్‌. ఇంత గొప్ప వ్యక్తికి బహుమతిగా ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర తన కంపెనీ కారు థార్‌తో సత్కరించాలనుకుంటున్నానని బహుమతి ప్రకటించారు. తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్‌ మహీంద్ర. సర్ఫరాజ్‌ ఖాన్‌ టెస్టు అరంగేట్రం సందర్భంగా చెప్పినట్లుగా నౌషద్‌ ఖాన్‌కు మహీంద్రా కారును అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Published : 
  • 23 March 2024, 4:49 PM IST