ప్రకాశం బ్యారేజ్ పడవల పరిస్థితి ఏంటీ…?

ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు ప్రారంభం అయ్యాయి. నిపుణుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ 67, 69 నెంబర్‌ గేట్లకు మరమ్మతు పనులు మొదలయ్యాయి.

Post Published By: Vencateshg
Updated : 5 September 2024, 2:21 PM IST

ప్రకాశం బ్యారేజీ వద్ద దెబ్బతిన్న గేట్లకు మరమ్మతులు ప్రారంభం అయ్యాయి. నిపుణుల పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌ 67, 69 నెంబర్‌ గేట్లకు మరమ్మతు పనులు మొదలయ్యాయి. బ్యారేజ్‌ 68, 69వ గేటు వద్ద పడవ ఢీకొని దెబ్బతిన్న కౌంటర్‌ వెయిట్‌ ను బయట తయారు చేయించి అక్కడ అమరుస్తారు. నిపుణులు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో మరమ్మతు పనులు జరుగుతున్నాయి.

బ్యారేజీ పై ఉండి పనులను పలు విభాగాల నిపుణులు పర్యవేక్షిస్తున్నారు. మరమ్మతు పనులను బెకెమ్ ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చేస్తోంది. పోలవరం గేట్లు, పులిచింతల, ప్రాజెక్టుల గేట్లను బెకెమ్ ఇన్ ఫ్రా ఏర్పాటు చేసింది. ఇక మొన్న అడ్డం పడిన పడవలను కూడా అక్కడి నుంచి సంస్థ తొలగిస్తుంది. గేట్లను మూసిన తర్వాత వాటిని అక్కడి నుంచి తొలగిస్తారు. ఆ పడవల కారణంగానే ప్రకాశం బ్యారేజ్ లో గేట్లు దెబ్బ తిన్నట్టు తెలుస్తోంది.

Published : 
  • 5 September 2024, 2:21 PM IST