ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం జగన్.. కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణం. దీంతో చేసేదేమీ లేక శ్రీనివాస్, ఆయన కుటుంబం ఆమరణదీక్షకు దిగుతున్నారు. కోడి కత్తి దాడి కేసులో శ్రీనివాస్‌కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ.. ఐదేళ్లుగా ఆయన కుటుంబం కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది.
