Dudapaka Praveen

Dudapaka Praveen

DialNews
Director Puri: పూరీ జగన్నాథ్‌ ఎందుకు కనిపించడంలేదు ?
Director Puri: పూరీ జగన్నాథ్‌ ఎందుకు కనిపించడంలేదు ?

“3 నెలల్లో సినిమా తీసి కూడా ఇండస్ట్రీ హిట్‌ కొట్టగలడు” ఇది పూరీ జగన్నాథ్‌కు టాలీవుడ్‌లో ఉన్న రెపుటేషన్‌. బద్రి, ఇడియట్‌, పోకిరీ, గోలీమార్‌ ఇలా చెప్పుకుంటూ పోతే పూరీ జగన్నాథ్‌ బ్లాక్‌బస్టర్‌ సినిమాల లిస్ట్‌ చాలా పెద్దగా ఉంటుంది. కథ, కథనం విషయం పక్కన పెడితే.. కేవలం హీరో క్యారెక్టరైజేషన్‌ మీదే సినిమా తీయగల సత్తా ఉన్న అతి తక్కువ మంది డైరెక్టర్స్‌లో పూరీ జగన్నాథ్‌ ప్రముఖుడు. అయితే చాలా రోజుల నుంచి ఈ డైరెక్టర్‌ ఎక్కడా కనిపించడంలేదు. కనీసం పోడ్‌కాస్ట్‌లో వినిపించడంలేదు. ఏ ఈవెంట్‌కు రావడంలేదు. లైమ్‌లైట్‌కు లాంగ్‌ డిస్టెన్స్‌ పాటిస్తున్నాడు.