Top story: తులం గోల్డ్‌ 40లక్షలు.. ఇప్పుడు కొనకపోతే మీ ఖర్మ!

ఎంతెంత దూరం బంగారం అంటే.. నువ్ అందుకోలేనంత దూరం అని వెక్కిరిస్తోంది బంగారం. దిగిరా బంగారం అని కోరుకునే రోజులు పోయాయ్‌.. ఎ

  • Written By:
  • Publish Date - January 28, 2026 / 01:15 PM IST

ఎంతెంత దూరం బంగారం అంటే.. నువ్ అందుకోలేనంత దూరం అని వెక్కిరిస్తోంది బంగారం. దిగిరా బంగారం అని కోరుకునే రోజులు పోయాయ్‌.. ఎక్కడున్నవావో అక్కడ ఆగిపో బంగారం అని వేడుకునే రోజులు వచ్చేశాయ్‌. గోల్డ్ ఆ రేంజ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తోంది మరి. సీజన్‌తో సంబంధం లేకుండా.. అందనంత ఎత్తుకు వెళ్తోంది. భారతీయులు, బంగారానిది విడదీయరాని బంధం. సంతోషం, సంబురం.. ప్రేమలు, ఆప్యాయతలు.. అన్నీ అల్లుకొని కనిపిస్తాయ్ గోల్డ్ చుట్టూ ! ఐతే ఇప్పుడు పెరుగుతున్న ధరలతో బంగారం కొనాలా వద్దా.. కొంటే లాభమా.. లేదా అనే చర్చ మధ్య తరగతి జనాల్లో వినిపిస్తోంది.

ఇదే ప్రశ్న ఏఐని అడిగితే.. మైండ్‌బ్లోయింగ్ ఆన్సర్ ఇచ్చేసింది. రష్యా, యుక్రెయిన్ యుద్ధంతో పాటు.. ఇరాన్ వైపు దూసుకెళ్తున్న అమెరికా బలగాలు.. బలహీనపడుతున్న రూపాయి.. ఇలా బంగారం రేటు పెరుగుదలకు చాలా కారణాలు కనిపిస్తున్నాయ్‌. ప్రస్తుతం తులం గోల్డ్‌.. లక్షా 60వేల దగ్గర కొనసాగుతోంది. వారం రోజుల గ్యాప్‌లో దాదాపు 15వేలు పెరిగింది. నిజానికి ఇదే తులం బంగారం ధర.. 2025 స్టార్టింగ్‌లో 90 వేల లోపే ఉంది. అంటే ఏడాదిలో దాదాపు 70వేలు పెరిగిందన్నమాట. ఈ ఏడాది చివరికి 2లక్షలకు చేరుకోవడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడు సంగతి సరే.. మరో పాతికేళ్లలో.. అంటే.. 2050నాటికి బంగారం రేట్లు ఎలా ఉంటాయ్‌.. పెరుగుతాయా, తగ్గుతాయా అని ఏఐ టూల్స్‌ను అడిగితే.. సర్‌ప్రైజింగ్ ఆన్సర్‌ ఇచ్చింది.

చాట్ జీపీటీ, గ్రోక్, గూగుల్ జెమినీని.. బంగారం ధరలపై ఓ అడ్వైజ్ అడిగితే.. దాదాపు అన్నీ ఒకేరకంగా ఇచ్చాయ్ ఆన్సర్‌. 2050 నాటికి తులం బంగారం 40 లక్షలకు చేరుకునే చాన్స్ ఉందని అంచనా వేశాయ్‌. గత కొన్నేళ్లుగా గోల్డ్ రేట్లలో జరుగుతున్న మార్పులను అంచనా వేసి.. భవిష్యత్తులో ఎంత పెరుగుతాయనేది వార్షిక వృద్ధి రేటును అంచనా వేసి ఏఐ టూల్స్ ఈ వివరాలు ఇచ్చాయ్‌. 10శాతం యాన్యువల్ గ్రోత్‌ నమోదు చేస్తే.. 2050నాటికి 10 గ్రాముల బంగారం 14 నుంచి 15 లక్షలకు చేరుకోవచ్చని అంటున్నాయ్‌. బలమైన డిమాండ్, రూపాయి విలువ పడిపోవడం, ద్రవ్యోల్బణ ప్రభావాలు కొనసాగితే.. 2050 నాటికి 20 నుంచి 22 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేశాయ్‌. దీంతో మధ్యతరగతి జనాలు అవాక్కవుతున్న పరిస్థితి. ఏఐని నమ్మాలా వద్దా.. బంగారం కొనాలా వద్దా అని ఒకటే డిస్కషన్‌.