Top story:రెప్పపాటులో లాగేస్తారు… క్షణాల్లో మాయమవుతారు…!

ఒంటరి మహిళలను టార్గెట్​గా చేసుకుని, మెరుపు వేగంతో వస్తారు. రెప్పపాటు కాలంలో మెడలో గొలుసు లాగేసుకుంటారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మాయం అయిపోతారు.

  • Written By:
  • Publish Date - January 28, 2026 / 07:50 PM IST

ఒంటరి మహిళలను టార్గెట్​గా చేసుకుని, మెరుపు వేగంతో వస్తారు. రెప్పపాటు కాలంలో మెడలో గొలుసు లాగేసుకుంటారు. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మాయం అయిపోతారు. గొలుసు దొంగతనాలపై పోలీసులు ఎప్పటికప్పుడు ఉక్కు పాదం మోపుతున్నప్పటికీ, కొంతమంది కేటుగాళ్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఒంటరి మహిళలే లక్ష్యంగా గొలుసుల చోరీలకు తెగబడుతున్నారు. హైదరాబాద్‌లో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోన్న మహిళల మెడలో బంగారు గొలుసు ఎత్తుకెళ్తున్నారు.

అసలే రోజురోజుకీ బంగారం ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఒక్కో గ్రాము కొనుగోలు చేయాలన్నా…చుక్కలను తాకుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రూ.లక్షా 60వేలుగా ఉంది. దీంతో బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు కూడా వాటికి ఇచ్చే తనఖాపై రుణాల స్థాయిని కూడా పెంచేశాయి. అయితే ఇదే అదునుగా కొందరు ఆకతాయిలు అకస్మాత్తుగా బైక్​లపై వచ్చి ఒంటరిగా సంచరిస్తున్న మహిళలను దోచుకుంటున్నారు. తరువాత వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారు. మహిళల మెడలోంచి దుండగులు…బైక్​పై వెళ్తూ బంగారు గొలుసును లాక్కెళ్తున్నారు.

తన ఆనవాలు గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్, తలకి టోపీ ధరిస్తున్నారు. దుండగులు మహిళలను అనుసరించి…పక్కా ప్లాన్ ప్రకారమే చైన్‌స్నాచింగ్‌కు పాల్పడుతున్నారు. ఒక స్నాచింగ్‌‌‌‌ చేసినా చాలు…2 నుంచి రూ.3 లక్షలు గ్యారెంటీగా వస్తాయి. ఈ కారణంతోనే చైన్​స్నాచర్లు రెచ్చిపోతున్నారు. బైకులపై మెరుపు వేగంతో వచ్చి ఇంటి ముందు ముగ్గులు వేస్తున్న మహిళలు, వాకింగ్‌ చేస్తున్న వారు…రోడ్డుపై ఒంటరిగా నడిచివెళ్లే వారి మెడలోంచి పుస్తెల తాళ్లు, చైన్లు తెంపుకెళ్తున్నారు. పట్ట పగలే రెచ్చిపోతున్న దొంగలు.. అడ్డొస్తే హత్య చేసేందుకూ వెనుకాడడం లేదు.

తెలంగాణలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో చైన్‌స్నాచర్లు పంజా విసురుతున్నారు. బంగారం రెక్కిలు నిర్వహిస్తున్నారు. పట్టపగలే…మహిళల మెడలో నుంచి బంగారు గోలుసులు దోచుకెళ్తున్నారు. సంక్రాంతి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 30కిపైగా చైన్​ స్నాచింగ్‌‌‌‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఒంటిపై బంగారం వేసుకొని బయటకు వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. ఇటీవల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. సంక్రాంతి తర్వాత 8 చోట్ల చైన్ స్నాచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పాల్పడ్డారు. ఎల్బీనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చైతన్యపురి, హయత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్ కుంట్లూరులో గంట వ్యవధిలోనే మూడు చోట్ల మహిళల మెడలోంచి గొలుసులు, పుస్తెల తాళ్లు తెంపుకెళ్లారు. సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గోపాలపురంలో పల్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చోరీ చేసిన ఇద్దరు దొంగలు ముఖానికి మాస్కులు ధరించి వరుస చైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్నాచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. సిటీలో రాత్రి పూట షాపింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి వస్తున్న, కాలనీ రోడ్లపై నడుస్తున్న ఒంటరి మహిళలతోపాటు బైక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెనుక కూర్చున్న వారిని కూడా చైన్​స్నాచర్లు వదలట్లేదు.

ముఖానికి మాస్కులు ధరించి వస్తున్న దొంగలు రెప్పపాటులో మాయమయ్యేందుకు స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బైక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వాడుతున్నారు. పట్టుకునేందుకు యత్నించే వారిపై కత్తులు, రాళ్లతో దాడులకు తెగబడుతున్నారు. గంజాయి, బెట్టింగులు, జల్సాలకు బానిసలైనవారు ఈజీ మనీ కోసం వృద్ధులను టార్గెట్​చేసి బంగారం ఎత్తుకెళ్తున్నారు. ఈ క్రమంలో హత్యలకూ పాల్పడుతున్నారు. నల్గొండ జిల్లాలో తాజాగా బంగారం కోసం ఓ వృద్ధురాలిని హత్యచేయడం కలకలం రేపింది. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో చైన్ స్నాచింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగినా పోలీసులకు ఒక్కరంటే ఒక్క దొంగ కూడా చిక్కలేదు. మేడిపల్లిలో 8 ఇళ్లలో జరిగిన దోపిడీలకు పాల్పడ్డారు.

చైన్ స్నాచింగ్‌లు, చోరీలు జరిగిన ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ…స్నాచర్లు మెరుపు వేగంతో చైన్లు లాక్కెళ్లిపోతున్నారు. కమాండ్​ కంట్రోల్​ సెంటర్​ నుంచి నిరంతర పర్యవేక్షణ ఉన్నప్పటికీ…దొంగలు మాత్రం తమ పని కానిస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెక్కీలు వేసి మరీ చోరీలు చేస్తున్నాయి. హై టెక్నాలజీ సీసీటీవీ కెమెరాలు ఉన్నా.. పట్టుకోండి చూద్దామంటూ పోలీసులకు సవాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌విసురుతున్నాయి. సీసీటీవీ కెమెరాల నిర్వహణ లోపాలు, రాత్రి సమయాల్లో బైక్ నంబర్లను గుర్తించే నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లేకపోవడం చైన్ స్నాచర్లకు కలిసివస్తున్నది. స్నాచర్లు మాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ధరించి ఉండడం, బైక్ నంబర్ ప్లేట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సరిగా కనిపించకపోవడం సమస్యగా మారింది. అసలు దొంగలను పట్టుకోలేక…పోలీసులు చేతులెత్తేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.. దొంగలు దొరకకపోవడం వల్ల బాధితుల బంగారం కూడా రికవరీ కావట్లేదు.