ఇండియన్ సినిమా చూపులన్నీ ఇప్పుడు ధురంధర్ 2 పైనే ఉన్నాయి. మొదటి భాగం ఊహించిన దానికంటే ఎక్కువ సంచలనాలు సృష్టించింది. ఈ సంచలనం తర్వాత సీక్వెల్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ అమాంతం పెరిగాయి. కేవలం ఒక ప్రాంతీయ సినిమాగా కాకుండా.. భారీ పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోంది. ఈ మెగా ప్రాజెక్ట్ కోసం సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ ప్రముఖుల వరకు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటి భాగం సాధించిన ఘన విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, పరిశ్రమ వర్గాలు ఈ సీక్వెల్ మీద భారీ టార్గెట్‌ను ఫిక్స్ చేశాయి. సాధారణంగా హిట్ సినిమా సీక్వెల్స్‌కి ఉండే క్రేజ్ కారణంగా.. పార్ట్ 1 వసూళ్ల కంటే ఈసారి కనీసం 40% ఎక్కువ వసూళ్లు ఉంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అసలు లెక్కల్లోకి వెళ్తే.. మొదటి భాగం ఇండియాలోనే ₹900 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దానికి ఇండస్ట్రీ ఆశిస్తున్న 40% వృద్ధిని కలుపుకుంటే ₹900 కోట్లు + 40% అంటే.. ధురంధర్ 2 ఇండియాలోనే మాత్రమే దాదాపు ₹1260 కోట్ల నెట్ వసూలు చేస్తుందని అంచనా.
ఇదే ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్న హాట్ టాపిక్. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ సైతం 1340 కోట్లు దాటాయి.. దాంతో సీక్వెల్ కనీసం 40 శాతం అదనం అంటే.. ఈజీగా 2000 కోట్ల మార్క్ అందుకుని.. బాహుబలి 2 పేరు మీదున్న రికార్డులన్నీ తుడిచేస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. మరోవైపు ఈ సినిమా మేకర్స్, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల కాన్ఫిడెన్స్ మాత్రం మరో లెవల్‌లో ఉంది. సినిమా అవుట్‌పుట్, ప్రేక్షకుల్లో ఉన్న హైప్ చూస్తుంటే.. ఈసారి ఇండియాలోనే 1500 కోట్లు.. ఓవరాల్‌గా 2200 కోట్ల మ్యాజికల్ ఫిగర్‌ను అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదని వారు భావిస్తున్నారు. వాళ్ల అంచనాలు ఇండస్ట్రీ లెక్కల కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. నిర్మాతలు అంత నమ్మకంగా ఉన్నప్పటికీ, ఇండస్ట్రీ మాత్రం అంచనాలను కాస్త తక్కువగానే ఉంచడానికి ఇష్టపడుతోంది.
ఎందుకంటే అంచనాలు మరీ ఆకాశాన్ని తాకితే, ఫలితం కొంచెం తేడా వచ్చినా అది తీవ్ర నిరాశకు దారితీస్తుంది. అందుకే ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ జోలికి వెళ్లకుండా, సేఫ్ జోన్‌లో అంచనాలు వేయడమే మంచిదని విశ్లేషకులు భావిస్తున్నారు. చివరగా ఏ లెక్కలు ఎలా ఉన్నా… ధురంధర్ 2 బాక్సాఫీస్ దగ్గర ₹2000 కోట్ల మార్క్‌ను టచ్ చేసినా సరే, అది అద్భుతమైన విజయంగానే పరిగణించబడుతుంది. ఏదేమైనా ఈ ఫిగర్ దాటితే చాలు, నిర్మాతల నుండి బయ్యర్ల వరకు అందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారనడంలో సందేహం లేదు. మార్చి 19న విడుదల కానుంది ఈ చిత్రం. తెలుగు, తమిళం నుంచే ధురంధర్ 2కు ఈజీగా 150 కోట్ల గ్రాస్ వస్తుందని ఓ అంచనా. ఎందుకంటే మొదటి భాగం హిందీ వర్షన్ తెలుగు రాష్ట్రాల్లో 40 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇప్పుడు తెలుగులో కూడా విడుదల కాబోతుంది కాబట్టి.. ధురంధర్ 2 ఈజీగా 80 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనాలైతే ఉన్నాయి. చూడాలిక ఏం జరగబోతుందో..?