Top story:ఇరాన్‌పై దాడి.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్ ఇది ఆరంభమే.. అసలు యుద్ధం వేరే

ఇరాన్‌పై భీకర దాడికి అమెరికా సిద్ధమైందా? ఏ క్షణమైనా వార్‌సీన్‌లోకి ఇజ్రాయెల్ ఎంట్రీ ఇవ్వబోతోందా?

  • Written By:
  • Publish Date - January 24, 2026 / 09:32 AM IST

ఇరాన్‌పై భీకర దాడికి అమెరికా సిద్ధమైందా? ఏ క్షణమైనా వార్‌సీన్‌లోకి ఇజ్రాయెల్ ఎంట్రీ ఇవ్వబోతోందా? ఆ రెండు దేశాలతో అమీతుమీకి ఇరాన్ కూడా సిద్ధపడిందా? ప్రస్తుత పరిణామాలు చూస్తే ఔననే చెప్పాల్సి వస్తుంది. అమెరికాస్ మోస్ట్ డెడ్లీయెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇరాన్ దిశగా వెళుతోందని స్వయంగా ట్రంపే చెప్పాడు. ఇజ్రాయెల్ టాప్ డిఫెన్స్ అఫీషియల్స్ వార్‌రూమ్‌‌‌కు షిఫ్ట్ అయిపోయారు. తాము ట్రిగ్గర్‌లో ఉన్నాం అని టెహ్రాన్ సంచలన ప్రకటన చేసింది. సో.. ఎనీటైం మిడిల్‌ఈస్ట్ బ్లాస్ట్ అయ్యే సిట్యువేషనే కనిపిస్తోంది. కానీ, ఇరాన్‌పై దాడి విషయంలో ట్రంప్ ఇప్పుడే ఎందుకు వ్యూహం మార్చాడు? ఇజ్రాయెల్ అసలేం ప్లాన్ చేస్తోంది? ఈ రెండు దేశాలను ఒకేసారి ఢీకొట్టే సత్తా నిజంగా టెహ్రాన్‌కు ఉందా? అన్నింటికీమించి ఇరాన్ దిశగా దూసుకెళుతున్న మాన్‌స్టర్ వార్ షిప్ ఏంటి?

ప్రపంచం అటెన్షన్ అంతా గ్రీన్‌లాండ్‌పై ఉన్న వేళ.. ఎయిర్‌ఫోర్స్ వన్‌లో ట్రంప్ చేసిన షాకింగ్ కామెంట్స్ ఇవి. అతిపెద్ద నౌకాదళం ఇరాన్ దిశగా వెళుతోందని ప్రకటించాడు. ఏమీ జరగకూడదనే తాను కోరుకుంటున్నా అంటూనే.. ఇరాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇరాన్ కలలో కూడా చూడలేనంత దారుణమైన దెబ్బ ఎదుర్కోవాల్సి వస్తుందన్నాడు. ఇరాన్ అణు కార్యక్రమానికి చేసిన దానితో పోలిస్తే ఈ దాడి చాలా పెద్దదిగా ఉంటుంది అని ఇరాన్‌ను హెచ్చరించాడు. అందుకు కారణం 837 మందిని ఇరాన్ ఉరి తీయబో తోందన్న వార్తలే. టెహ్రాన్ ఆ పని చేస్తే.. తమ నేవీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుందని బెదిరించాడు. ట్రంప్ హెచ్చరికలు సాధారణమైనవి కావు.. ఇరాన్‌పై దాడికి సిద్ధపడే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఎందుకంటే, ఇరాన్ దిశగా వెళుతోంది అమెరికా మిలిటరీలోనే అత్యంత శక్తివంతమైన నౌకాదళం. దాని పేరు USS అబ్రహం లింకన్.

USS అబ్రహం లింకన్ అతి పెద్ద నౌక. ఇరాన్ సైన్యాన్ని ఒక దెబ్బకు నాశనం చేయగల సత్తా ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. ఈ నౌకతో పాటు గైడెడ్ మిస్సైల్ క్రూయిజర్లు, డిస్ట్రాయర్లు, సబ్‌మెరైన్లు, ఇతర నౌకలతో స్ట్రైక్ గ్రూప్ ఉంటుంది. USS అబ్రహం లింకన్‌ నౌకలో డెడ్లీ ఫైటర్ జెట్స్ ఉంటాయి. యుద్ధానికి దిగితే భూమి నుంచి.. సముద్రం నుంచి.. ఆకాశం నుంచి ఎక్కడి నుంచైనా శత్రువును దెబ్బ కొట్టగల సామర్థ్యం ఉంటుంది. తనకేమైనా జరిగితే ఈ భూమ్మీద ఇరాన్‌ను లేకుండా చేస్తానని ట్రంప్ బెదిరించడానికి కారణం ఈ నౌకను ఇరాన్ వైపు పంపడమే. అమెరికా దగ్గర ఉన్న విధ్వంసక ఆయుధాలు ఇరాన్ మొత్తాన్ని సర్వనాశనం చేయగలదని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ సైనిక స్థావరాలు, క్షిపణి స్థావరాలు, ప్రమాదకర లక్ష్యాలను నిమిషాల్లోనే లక్ష్యం చేసుకోగల శక్తి ప్రస్తుతం అమెరికా దగ్గర ఉంది. ట్రంప్ చెప్పినట్టు ఇరాన్‌పై దాడి జరిగితే ఆ దాడిని అడ్డుకోవడం టెహ్రాన్‌కు ఇంపాజిబుల్. సో.. ఈ సారి ఇరాన్‌కు మూడినట్టే కనిపిస్తోంది.

నిజానికి.. USS అబ్రహం లింకన్‌ వారం రోజుల క్రితమే ఇరాన్ దిశగా జర్నీ స్టార్ట్ చేసింది. కానీ, చైనా సైనిక కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు దక్షిణ చైనా సముద్రంలో మోహరించిన ఈ నౌక అక్కడి నుంచి పశ్చిమాసియా వైపు బయల్దేరినట్లు నివేదికలు తెలిపాయి. అది పశ్చిమాసియాను చేరుకోవడానికి దాదాపు వారం రోజులు పడుతుందని ఆ కథనాలు పేర్కొన్నాయి. అయితే అమెరికా అధికారులు మాత్రం ఈ సమాచారాన్ని ధ్రువీకరించలేదు. వెనెజువెలాపై సైనిక దాడి జరపడానికి ముందు అమెరికా ఇదే రకమైన పంథాను ఎంచుకుంది. ఇప్పుడు ఇరాన్ విషయంలో అదే ఫార్ములాను ఫాలో అవుతున్నట్టు కనిపి స్తోంది. డిఫెన్స్ ఎక్స్‌పర్ట్స్ అంచనాల ప్రకారం USS అబ్రహం లింకన్.. ఇరాన్‌పై దాడికి అనుకూలమైన పొజిషన్‌లోనే ఉండివ ఉండొచ్చు. ఎనీటైం దాడి జరగొచ్చు కూడా. ట్విస్ట్ ఏంటంటే.. ఈ క్షణాల కోసం మరో దేశం ఆశక్తిగా ఎదురుచూస్తోంది. ఆ దేశం ఏదో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

ఇజ్రాయెల్ టాప్ డిఫెన్స్ అఫీషియల్స్ కొద్ది గంటలుగా వార్‌రూమ్‌‌లోనే ఉన్నట్టు పలు నివేదికలు చెబుతున్నాయి. ఎందుకంటే, అమెరికా కనుక ఇరాన్‌పై దాడికి దిగితే టెహ్రాన్ నుంచి డేంజర్ క్షిపణులు ఇజ్రాయెల్‌వైపే దూసుకెళతాయి. ఇంతకు ముందు చెప్పినట్టు తాము ట్రిగ్గర్‌లోనే ఉన్నామనీ, అన్నింటికీ సిద్ధమని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ ప్రతిదాడిచేస్తే అది పశ్చిమాసియాలోని అమెరికా సైనికస్థావరాలు, ఇజ్రాయెల్‌పైనే. సో.. ఇజ్రాయెల్ కూడా అప్రమత్తతో ఉందన్నమాట. ఇక ట్రంప్ ఇప్పుడే దాడికి సిద్ధం కావడానికి సామాన్యులను ఉరి తీసే ప్రయత్నాలే అని పైకి చెబుతున్నా.. అసలు కారణం మరొకటి ఉంది. అదే గ్రీన్‌లాండ్. ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకోడానికి ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ, మిత్ర దేశాలైన యూరోపియన్ దేశాలు అందుకు ససేమిరా అంటున్నాయి. సో.. ఇరాన్‌పై దాడిచేసి తాను తలచుకుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చూపించాలనుకుంటున్నాడు. కాబట్టి ఇది కేవలం ఇరాన్‌‌తోనే ఆగకపోవచ్చు.