బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టాయిలెండర్లు అద్భుతం చేశారు. బ్యాటర్లు చేయాల్సిన పనిని బౌలర్లు బాధ్యత తీసుకుని జట్టు గౌరవాన్ని కాపాడారు. గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో బుమ్రా, ఆకాశ్ దీప్ కలిసి ఫాలో ఆన్ గండం నుంచి తప్పించారు. ముఖ్యంగా ఆకాశ్ దీప్ బ్యాటింగ్ అదిరిందనే చెప్పాలి.
