విశాఖపట్నం జగదాంబ జంక్షన్ లోని ఇండస్ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇండస్ ఆసుపత్రిలోని రెండో అంతస్థులో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున దట్టమైన పొగతో మంటలు వ్యాపించాయి. దీంతో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆసుపత్రి మొత్తం దట్టమైన పొగ అలుముకోగా.. ఊపిరాడక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు రోగులు మంటల్లో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. ఘటన స్థలానికి చేరుకోని నాలుగు ఫైరింజన్లతో మంటలను అదుపు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

A massive fire broke out at Indus Hospital in Jagadamba Junction, Visakha