బ్రేకింగ్: పోలీస్ స్టేషన్ కు రాజ్ తరుణ్

తన మాజీ ప్రేయసి లావణ్యతో నెలకొన్న వివాదం నేపధ్యంలో నేడు నార్సింగి పోలీసుల ముందు హీరో రాజ్ తరుణ్ విచారణకు హాజరు కానున్నాడు.

Post Published By: Vencateshg
Updated : 17 August 2024, 10:55 AM IST

తన మాజీ ప్రేయసి లావణ్యతో నెలకొన్న వివాదం నేపధ్యంలో నేడు నార్సింగి పోలీసుల ముందు హీరో రాజ్ తరుణ్ విచారణకు హాజరు కానున్నాడు. ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్... 8 వారాల పాటు ప్రతీ శనివారం రాజ్ తరుణ్ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. దీనితో నేడు నార్సింగి పోలీసుల ఎదుట రాజ్ తరుణ్ హాజరు అవుతున్నాడు.

ఈ వ్యవహారానికి సంబంధించి టాలీవుడ్ లో ఒక ప్రముఖ నిర్మాత రాజ్ తరుణ్ కు అండగా నిలబడినట్టు వార్తలు వస్తున్నాయి. కేవలం తన వద్ద నుంచి డబ్బు లాగడానికే ఆమె ప్రయత్నాలు చేస్తుందని అందుకే ఈ వ్యవహారానికి సంబంధించి ఆమె అంత అల్లరి చేస్తోందని రాజ్ తరుణ్ నిర్మాతకు చెప్పినట్టుగా సమాచారం. ఇటీవల ఆమెకు సంబంధించిన ఆడియోలు కూడా బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.

Published : 
  • 17 August 2024, 10:55 AM IST