తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కాన్వాయ్ లోని కార్లకు బ్లాక్ రంగు మార్చాలని ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరకూ ఆయన ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూయిజర్ రంగు బ్లాక్ లో ఉంది. మిగతావన్నీ వైట్ కలర్ లో ఉన్నాయి. దాంతో సీఎం రేవంత్ రెడ్డి ఎందులో ప్రయాణిస్తున్నారో బయటి వారికి క్లియర్ గా తెలిసిపోతుంది. ఇది చాలా డేంజర్. దుండగులు సీఎంను టార్గెట్ చేసే ఛాన్స్ ఈజీగా ఉంటుంది. అందుకే కాన్వాయ్ లోని కార్లనీ ఇక ముందు ఒకే కలర్ లో.. నలుపు రంగులోకి మార్చబోతున్నారు.

Color change of CM convoy cars! What color does Revanth Reddy like?