తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ముగిసాయి. ఊహించినట్లుగానే అసెంబ్లీ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్ జరిగింది. కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో కుల ప్రాతిపదికన ఓటింగ్ జరిగిందనేది వాస్తవం. ఉత్తర తెలంగాణలో ఒకలా.. దక్షిణ తెలంగాణలో మరోలా పోలింగ్ జరిగినట్లు రాజకీయ విశ్లేషకుల వాదన. ముఖ్యంగా 6 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం.. ఈ ఎన్నికల్లో పూర్తిగా రివర్స్ అవుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Do you know the polling percentage of the parliamentary election districts in Telangana?