రతన్‌ టాటా వాచ్‌ ధర ఎంతో తెలుసా

రతన్‌ టాటా పేరు చెప్తేనే మనందరికీ గుర్తొచ్చేది తిరుగు లేని కంపెనీలు. దాదాపు ప్రపంచం మొత్తం ఆయన బ్రాండ్‌లు విస్తరించి ఉన్నాయి. అన్ని బ్రాండ్‌లకు అధిపతి అయిన టాటాకు మాత్రం తన వాచ్‌ చాలా ప్రత్యేకం. చనిపోయేవరకు కూడా టాటా అదే వాచ్‌ను పెట్టుకున్నారు.

Post Published By: Vencateshg
Updated : 16 October 2024, 12:46 PM IST

రతన్‌ టాటా పేరు చెప్తేనే మనందరికీ గుర్తొచ్చేది తిరుగు లేని కంపెనీలు. దాదాపు ప్రపంచం మొత్తం ఆయన బ్రాండ్‌లు విస్తరించి ఉన్నాయి. అన్ని బ్రాండ్‌లకు అధిపతి అయిన టాటాకు మాత్రం తన వాచ్‌ చాలా ప్రత్యేకం. చనిపోయేవరకు కూడా టాటా అదే వాచ్‌ను పెట్టుకున్నారు. అంతటి బిలియనీర్‌ పెట్టుకున్న వాచ్‌ అంటే ఎన్ని కోట్ల ఖరీదైందో అనుకుంటున్నారు కదా. కానీ టాటా పెట్టుకునే వాచ్‌ జస్ట్‌ 10 వేలు మాత్రమే. స్విస్‌ ఆర్మీ బ్రాండ్‌కు చెందిన ఓ క్లాసిక్‌ వాచ్‌ను టాటా ధరించేవారు. చూసేందుకు కూడా ప్రెస్‌ బ్యాక్‌తో చాలా సింపుల్‌గా ఉంటుంది ఆ వాచ్‌. నార్మల్‌గా కోటీశ్వరులు పెట్టుకనే వాచ్‌ అమ్మితే మన బ్యాచ్‌ మొత్తం సెట్‌ ఐపోతుంది. అలాంటిది ఇన్ని వేల కోట్ల అధిపతి అయ్యుండి కూడా ఇంత సింపుల్‌గా ఉండటం టాటాకు మాత్రమే సాధ్యమైంది

Published : 
  • 16 October 2024, 12:46 PM IST