తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది. వికారాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ప్రసాద్ కుమార్. ఈయన స్వగ్రామం తాండూర్ మండలం బెల్కటూర్. గతంలో టెక్స్‌టైల్ శాఖ మంత్రిగా పని చేశారు. ప్రసాద్ కుమార్ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు.. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి బి. సంజీవరావుపై గెలిచారు.

Gaddam Prasad Kumar as Speaker of the Assembly