Revanth Reddy CM

Telangana Congress : తెలంగాణ మార్పు కోరుకున్నా.. కాంగ్రెస్‌లో మాత్రం మార్పు లేదు..

Telangana Congress : తెలంగాణ మార్పు కోరుకున్నా.. కాంగ్రెస్‌లో మాత్రం మార్పు లేదు..

రెండు టర్ములు బీఆర్ఎస్‌ ప్రభుత్వాన్ని చూసిన తరువాత తెలంగాణ సమాజం మార్పు కోరుకుంది. ఆ కోరిక రీసెంట్‌ ఎలక్షన్‌లో చాలా క్లియర్‌గా కనిపించింది. ఇక పని అయిపోయింది అనుకున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రంలో కంబ్యాక్ తీసుకుంది. అది మామూలు కంబ్యాక్‌ కూడా కాదు. అధికార పార్టీని పడగొట్టి ఏకంగా 64 సీట్లలో గెలిచేంత కంబ్యాక్‌. ఇది మామూలు విషయం కాదు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ను మామూలుగా ఆధరించలేదు. ప్రజలు మార్పు కోరుకున్నా.. కాంగ్రెస్‌ పార్టీని నమ్మి అధికారం అప్పగించినా.. కాంగ్రెస్‌లో మాత్రం ఇప్పటికీ మార్పు రానట్టు కనిపిస్తోంది. ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి రెండ్రోజులయ్యింది.