ఇద్దరూ ట్రిపుల్ కొట్టేశారు, గోవా కుర్రాళ్ళ మాస్ జాతర
రంజీ మ్యాచ్ లో సెంచరీ చేయడం అంత ఈజీ కాదు… ఓపిగ్గా ఆడుతూ భారీ ఇన్నింగ్స్ ఆడాలి.. ఇక డబుల్ సెంచరీ అయితే దానికి రెట్టింపు పట్టుదల కావాల్సిందే.. మరి ట్రిపుల్ సెంచరీ కొట్టాలంటే ఎంతో సత్తా ఉండాలి… తాజాగా రంజీ ట్రోఫీ 2024 సీజన్ లో రికార్డుల మోత మోగింది.