సమకాలిన క్రికెట్ లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్ జో రూట్ పరుగుల వరద కొనసాగుతోంది. టెస్ట్ ఫార్మాట్ లో అత్యంత నిలకడగా రాణిస్తున్న జో రూట్ వరుస రికార్డులతో దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలో ప్రతీ సిరీస్ లోనూ భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డులను దాటేస్తున్నాడు.
