భారత్ , బంగ్లాదేశ్ రెండో టెస్టును వరుణుడు వెంటాడుతున్నాడు. మొదటి రోజు 34 ఓవర్ల ఆట మాత్రమే జరగ్గా… రెండోరోజు పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. 11 గంటలకు వర్షం తగ్గుముఖం పట్టినా సిబ్బంది కవర్లు తీసేలోపే మరోసారి వరుణుడు రీఎంట్రీ ఇచ్చాడు.