మాధురి ఆత్మహత్య ప్లాన్, ఆడియో లీక్…!

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. భార్య, బిడ్డలు ఉండగానే శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆయన భార్య దువ్వాడ వాణి, ఆయన కుమార్తె ఆరోపించిన సంగతి తెలిసిందే.

Post Published By: Vencateshg
Updated : 31 August 2024, 4:17 PM IST

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయిన సంగతి తెలిసిందే. భార్య, బిడ్డలు ఉండగానే శ్రీనివాస్ మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని ఆయన భార్య దువ్వాడ వాణి, ఆయన కుమార్తె ఆరోపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వ్యవహారం ఇప్పటికి కూడా ఒక కొలిక్కి రాలేదు. ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించి ఒక ఆడియో బయటకు వచ్చింది.

ఇటీవల దివ్వెల మాధురికి జరిగిన రోడ్డు ప్రమాదం ఘటన ఆత్మహత్య కాదని పక్కా ప్లానింగ్ అనే విషయం ఒక ఆడియో తో వైరల్ అయింది. రోడ్డు ప్రమాదాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఫోన్లో దువ్వాడ మాధురికి శ్రీనివాస్ సూచనలు చేసారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు దువ్వాడ మాధురితో శ్రీనివాస్ ఫోన్ చేసి మాట్లాడారు. మనస్థాపంతో తానే ఆత్మహత్య చేసుకున్నట్లు మీడియాతో చెప్పాలని మాధురికి శ్రీనివాస్ చెప్పారు. ఈ ఆడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దువ్వాడ వాణి వల్లే నేను చనిపోతున్నానని మీడియా ముందు చెప్పాలని మాధురికి శ్రీనివాస్ సలహా ఇచ్చారు. అయితే రోడ్డు ప్రమాదం జరిగినా సరే పోలీసులు సీసీ ఫూటేజ్ మాత్రం బయట పెట్టలేకపోయారు.

Published : 
  • 31 August 2024, 4:17 PM IST