Pawan Kalyan: పవన్ జీవన ప్రస్థానానికి నిదర్శనం.. మధుర జ్ఞాపకాలకు సాక్ష్యం.. ఇన్ స్టా ఫస్ట్ వీడియో

పవన్ కళ్యాణ్ ఈపేరును తప్పస్సు మంత్రంగా జపిస్తారు తన ఫ్యాన్స్. సినిమా అయినా రాజకీయం అయినా తనదైన పాత్రకు ప్రాణం పోస్తారు. తాజాగా వారాహి యాత్రతో సినీ, రాజకీయ ప్రయాణాన్ని బ్యాలెన్సింగ్ గా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిమానులతో పాటూ సామాన్య ప్రజానీకానికి చేరువయ్యేందుకు ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. అదే ఇన్ స్టా గ్రామ్. ఇందులో ఖాతా ఓపెన్ చేశారో లేదో ఇంస్టెంట్ గా 2 మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. అది కూడా ఒక్కపోస్ట్ చేయకుండానే. దీనిని బట్టే అర్థం అవుతుంది ఇతని ఛరిష్మా ఎంతటి స్థాయిలో ఉందో. ఇక చాలా కాలంగా పవర్ స్టార్ ఇంస్టా ఖాతాలో మొట్టమొదటి పోస్ట్ ఏం చేస్తారా అని ఆత్రతతో ఎదురు చూశారు అభిమానులు. ఈ సస్పెన్స్ కి తెరదించుతూ తాజాగా ఒక వీడియో పోస్ట్ చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 15 July 2023, 7:30 PM IST

Published : 
  • 15 July 2023, 7:30 PM IST

Exit mobile version