టీమిండియా గబ్బర్ సింగ్ శిఖర్ ధావన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. తాజాగా ధావన్ తాను క్రికెట్ కు గుడ్ బై ఎందుకు చెప్పాల్సి వచ్చిందో వివరించాడు. గత రెండు సంవత్సరాల్లో అంతర్జాతీయ మ్యాచ్ లు పెద్దగా ఆడలేదని, ఫామ్ లో కూడా లేనని అంగీకరించాడు.
