ఎట్టేకేలకు ఇయర్ ఎండ్‌కు చేరుకున్నాం. డిసెంబర్ నెలలో స్టార్ట్ ఐన వెంటనే ప్రతీ ఒక్కరికీ గుర్తొచ్చేది థర్టీఫస్ట్ నైట్ పార్టీ. సంవత్సరం మొత్తం ఏం సాధించనివాళ్లు కూడా.. 31 రాత్రి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. తెల్లారితే జీవితాలు మారిపోతాయి. ఇదే ఆఖరి రోజు అన్నట్టు ఒళ్లు తెలియకుండా తాడి రోడ్లపై నానా హంగామా చేస్తారు. అంతా ఇలాగే ఉంటారు అని కాదు.. కానీ హైదరాబాద్ లాంటి సిటీస్‌లో మాత్రం ఇలాంటి బ్యాచ్‌లు చాలా కనిపిస్తాయి.

Thirty-first night party is remembered by everyone as soon as it starts in the month of December