Where is Gundu Boss ? : గుండు బాస్ కనిపించుటలేదు… అజ్ఞాతంలో లలిత జ్యువెలర్స్ కిరణ్ …. ఏమైపోయాడు? ఎక్కడున్నాడు?

డబ్బులు ఎవరికీ ఊరికే రావు…. ఈ ఒక్క డైలాగ్ తో సౌత్ ఇండియాలో పాపులర్ అయిన  సెలబ్రిటీ బిజినెస్ మాన్, లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ జైన్ హఠాత్తుగా మాయమయ్యారు. ఆయన ఒకప్పటిలాXE టీవీల్లో కనిపించట్లేదు. రేడియోలో వినిపించట్లేదు. న్యూస్ పేపర్స్ లో భారీ ప్రకటనలు ఇవ్వట్లేదు. మీడియాకి ఇంటర్వ్యూలే లేవు. లలిత జ్యువెలరీ కిరణ్ ఏమైపోయాడా అంటూ దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో జనం చర్చించుకుంటున్నారు. దక్షిణ భారతదేశంలోని బంగారం వ్యాపారంలో కింగ్ గా పేరుపొందిన లలిత జ్యువెలరీ కిరణ్… ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాడని వదంతులు నడుస్తున్నాయి. వ్యాపారంలో బాగా దెబ్బతిన్నాడని గాసిప్స్ తిరుగుతున్నాయి.

Post Published By: dialnews
Updated : 4 April 2024, 11:44 AM IST

Published : 
  • 4 April 2024, 11:44 AM IST

Exit mobile version