మొహరం పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించారు ముస్లీం సోదరులు. ఈ వేడుకలో ప్రదాన ఘట్టం పీర్లను ఉత్సవంగా ఊరూరా త్రిప్పడం. చిన్న, పెద్ద పీర్లను పట్టుకొని అగ్నిగుండం ద్వారా నడుచుకుంటూ తీసుకెళ్లి చివరకు నీళ్లలో నిమర్జనం చేస్తారు. ఈ పండుగలో కులమతాలకు అతీతంగా అందరూ పాల్గొంటారు.

మొహరం సందర్బంగా సంబరాలు
పీర్లను ఎత్తుకొని ఊరేగించిన స్థానికులు
పీర్లను చేతిలో పట్టుకొని అగ్ని గుండంలో నడుస్తున్న భక్తులు
రకరకాల గొడుగులతో పీర్ల ను పురవీధుల గుండా తీసుకువచ్చారు
అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు
భగభగ మండే అగ్ని గుండం ఏర్పాటు
విద్యుత్ కాంతులతో దేదీప్యమానంగా అలంకరించారు
గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న సాంప్రదాయాన్ని నేటికీ కొనసాగిస్తున్నారు
వింతైన ఇత్తడి నాదస్వరాలను మోగించారు
సాంప్రదాయ యుతంగా ఉత్సవాలు నిర్వహించారు
చిన్న, పెద్ద అన్ని రకాల పీర్లను పట్టుకొని నిప్పుల గుండంలో నడిచి మొక్కు చెల్లించుకున్నారు