పోలవరం ప్రాజెక్ట్ పనులు దాదాపు 80శాతం పూర్తి అయ్యాయి. మిగిలిన పనులు యుద్ద ప్రాతిపదికన చేస్తున్నారు ఇంజనీరింగ్ అధికారులు. తాజాగా స్ప్రిన్ వే గేట్ల నుంచి నీటిని వదిలి ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ పూర్తైతే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. లక్షలాది ఎకరాలకు నీటిని అందించి సస్యశ్యామలంగా చేస్తుంది.

పోలవరంలో పరవళ్లు తొక్కుతున్న గోదారి
స్ప్రిన్ వే గేట్ల నుంచి నీటిని మళ్లింపు
తాజాగా తీసిన డ్రోన్ చిత్రాలు
ఒక వైపు పచ్చని చెట్లు, మరో వైపు నీటి ప్రవాహాలు
దాదాపు 80 శాతం పనులు పూర్తి.
రిజర్వాయర్ లో మట్టిపని 68% పూర్తి అయ్యింది
కరకట్ట పనులు 9% పూర్తికాగా కుడికాలవలో మట్టిపని 100% పూర్తి చేశారు
లైనింగ్ పనులు 81%
ఎడమకాలువ పనిలో మట్టిపని 87% పనులు వేగవంతంగా పూర్తి చేశారు అధికారులు
2021 మే నెల నాటికి 42.5 మీటర్ల ఎత్తులో కాపర్ డ్యామ్ నిర్మాణాన్ని ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు పూర్తి చేశారు
యుద్దప్రాతి పదికన పనులు చేస్తూ మరి కొన్ని నెలల్లో నీటిని అందించాలని చూస్తున్నారు
తాజాగా స్పిల్వే నుంచి 14 గేట్ల ద్వారా నీటి తరలింపునకు ఏర్పాట్లు చేశారు