గత అసెంబ్లీ రద్దైన నేపథ్యంలో నూతన అసెంబ్లీ నియామక ప్రక్రియ సాగాలి. ఇందుకోసం స్పీకర్ అవసరం. పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నికయ్యే వరకు ప్రొటెం స్పీకర్ విధులు నిర్వర్తిస్తారు. ఇందుకోసం అసెంబ్లీలో అత్యధికసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్లు ప్రొటెం స్పీకర్‌గా పని చేయాలి.
