వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు కావాలని ఆదేశించింది. వాట్సాప్ ద్వారా అవినాష్‌కు నోటీసులు పంపించారు అధికారులు. కానీ అప్పటికే ప్లాన్ చేసిన ప్రోగ్రామ్స్ ఉన్న కారణంగా తాను విచారణకు రాలేనంటూ సీబీఐకి లేఖ రాశారు అవినాష్. తాను పులివెందుల వెళ్తున్నానని.. మరో నాలుగు రోజులు సమయం కావాలంటూ లేఖ రాశారు.

CBI Notice to MP Avinash Reddy